కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఏపీ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఎయిర్‌పోర్ట్‌కు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోవడంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు.
కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడుతున్నట్టు సీఎం జగన్ చేసిన ప్రకటన నాకెంతో సంతోషాన్ని కలిగించింది. గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడికి దక్కిన నిజమైన గౌరవంగా నేను భావిస్తున్నాను. అలాగే అంతటి మహానుభావుడి బయోపిక్‌లో నటించడం, ఆయన పాత్ర పోషించడం ఓ అదృష్టంగా భావిస్తున్నాను అంటూ చిరంజీవి ట్విట్టర్‌లో చెప్పుకొచ్చాడు.కాగా, ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌ను ఏపీ ప్రభుత్వం సొంతంగా నిర్మించింది. ఇక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను ఆధారం సైరా సినిమాను తెరకెక్కించారు. చిరు తనయుడు రామ్‌చరణ్ నిర్మాతగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మంచి విజయం సాధించింది.