రియల్ హీరోస్ తో పని చేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు మెగాస్టార్ చిరంజీవి. మొదటిసారి పోలీసులతో కలిసి పని చేస్తున్నందుకు సంతోషంగా ఉందని…సినిమాల్లో హీరోగా నటించాను కానీ ఇప్పుడు నిజజీవితంలో హీరోలతో కలిసి పని చేస్తున్నానని ఆనందం వ్యక్తం చేసారు. పోలీసులు ఎలాంటి సహాయం అడిగినా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
కరోనా బారినపడి కోలుకున్న వారందరూ ప్లాస్మా దానం చేయాలని అందరూ ప్లాస్మా దానం చేస్తే కరోనాను తరిమి కొట్టొచ్చని తెలిపారు. తన అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయాలని కోరారు. సినీ కార్మికులకు మూడో దఫా నిత్యవసర సరుకులు త్వరలో పంపిణీ చేయబోతున్నామని అన్నారు. కార్పొరేట్ కంపెనీల నుండి విరాళాలు తీసుకుని సినీ కార్మికులను ఆదుకోబుతున్నామని వెల్లడించారు.