ఆదివారం మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి పుట్టిన రోజు సందర్భంగా.. ఆయన ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షాలు తెలియజేశారు. అలాగే ఆమెతో దిగిన ఫ్యామిలీ ఫొటోలను షేర్ చేశారు. ‘ ఈ రోజు మాకు జన్మని, జీవితాన్ని ఇచ్చిన అమ్మ పుట్టిన రోజు. జన్మజన్మలకు నీకే బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటున్నాను అమ్మా’.. అంటూ చిరు ట్వీట్ చేశారు.
ఈ ఫొటోలో చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ లతో పాటు ఇద్దరు అంజనీదేవి ఇద్దరు కూతుళ్లు, రామ్ చరణ్, ఉపాసన కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
కాగా లేటెస్ట్ గా చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీతో విజయం అందుకున్నారు. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పటివరకు సుమారు రూ.250 కోట్లు వసూలు చేసింది.
ఇక మరోవైపు సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ OG సినిమా నటించనున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. వీటి కోసం పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.