కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితం అయిన టాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. ఇక ఇటీవల సోషల్ మీడియా లోకి ఎంట్రీ ఇచ్చిన మెగా స్టార్ నిత్యం ఫాన్స్ కు దగ్గరగా ఉంటూ తన వ్యక్తిగత జీవితానికి సంబందించిన విషయాలను పంచుకుంటున్నాడు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఓ ఫన్నీ ఫొటోను షేర్ చేశాడు. 1990లో అమెరికా వెళ్లినపుడు అక్కడ వంట చేస్తున్న ఫొటోను.. ప్రస్తుతం సొంతింట్లో వంట చేస్తున్న ఫొటోను పోస్ట్ చేశాడు. ఆ రెండు ఫొటోల్లోనూ చిరంజీవి, ఆయన భార్య సురేఖ ఒకే రంగు బట్టల్లో, ఒకే స్టైల్లో నిల్చుని ఉన్నారు.
మొదటి ఫొటోకు `జాయ్‌ఫుల్ హాలీడే ఇన్ అమెరికా` అని, రెండో ఫొటోకు `జైల్‌ఫుల్ హాలీడే ఇన్ కరోనా` అని క్యాప్షన్ ఇచ్చారు. `కాలం మారినా.. దేశం మారినా.. తాను.. నేను మాత్రం ఏమీ మారలేదు` అంటూ టాగ్ లైన్ ఇచ్చారు చిరంజీవి.