దేవకట్ట దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రిపబ్లిక్. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తోంది. అక్టోబర్ 1న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ ను రేపు బుధవారం విడుదల చేయబోతున్నారు.
Advertisements
మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ కానుంది. ఉదయం 10 గంటలకు ఈ ట్రైలర్ మెగాస్టార్ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో తేజ్ ఐ.ఎ.ఎస్. అధికారి పంజా అభిరామ్ గా ఇందులో సాయి తేజ్ నటించాడు. ఇక మణిశర్మ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.