తమ్ముడు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ పై మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన గాడ్ ఫాదర్ దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మంగళవారం చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో చిరంజీవి పవన్ కళ్యాణ్ పార్టీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ నిజాయితీ, నిబద్ధత తనకు చిన్ననాటి నుంచి తెలుసన్నారు. ఫ్యూచర్ లో జనసేనకు మద్దతు ఇస్తానో లేదో తెలియదన్నారు.
తాము చెరోవైపు ఉండటం కంటే తాను తప్పుకోవడమే మంచితని నిర్ణయించుకున్నట్లు చిరు పేర్కొన్నారు. పవన్ కు నాయకత్వ పఠిమ ఉందని భవిష్యత్తులో తప్పకుండా మంచి నాయకుడు అవుతాడని అన్నారు. అంతే కాకుండా రాష్ట్రాన్ని ఏలే సామర్థ్యం పవన్ కు ఉందంటూ తెలిపారు. పవన్ మంచి స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నానని ఆయన తెలిపారు. తాను పాలిటిక్స్ నుంచి ఎగ్జిట్ అయి సైలెంట్‌గా ఉన్నానన్నారు.
అయితే, గాడ్ ఫాదర్ సినిమాలోని డైలాగ్స్ పై కూడా చిరంజీవి స్పందించారు. ప్రస్తుత నాయకులపై ఎలాంటి సెటైర్లు వేయలేదంటూ స్పష్టం చేశారు. లూసిఫర్ కథ ఆధారంగానే ఆధారంగానే డైలాగులు రాశామని చెప్పారు. ఈ డైలాగులు విని ఎవరైనా భుజాలు తడుముకుంటే తానేం చేయలేనన్నారు.
కానీ భవిష్యత్తులో తమ్ముడికి మద్దతు ఇవ్వొచ్చెమోనంటూ చెప్పకనే చెప్పారు. తాను రాజకీయాల నుంచి బయటకు రావడం పవన్ కు ఉపయోగపడుతుందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ప్రస్తుతం చిరు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. మెగాస్టార్ చేసిన ఈ వ్యాఖ్యలు కాసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.