కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. అలాగే రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కి సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.
రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ పై ఒక సాంగ్ షూట్ చేశారు. దీంతో చిరంజీవిపై మొత్తం షూటింగ్ కంప్లీట్ కాగా చరణ్ పై కొన్ని ప్యాచ్ వర్క్స్ మాత్రమే బ్యాలన్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.