మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కరోనా కారణంగా హోమ్ క్వరెంటైన్ లో రెస్ట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే నేడు మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి పుట్టినరోజు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ విషెస్ తెలియజేశారు.
అమ్మా జన్మదిన శుభాకాంక్షలు. క్వరెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నాను. నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు. మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నాను.అభినందనలతో …. శంకరబాబు అంటూ ట్వీట్ చేశాడు చిరంజీవి.
ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 1న ఈ చిత్రం రిలీజ్ కానుంది. దీంతోపాటు గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
చిరంజీవికి కరోనా పాజిటివ్ రావడంతో ప్రస్తుతం షూటింగ్ లు వాయిదాపడ్డాయి. అలాగే అభిమానులు సైతం చిరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు. ప్రత్యేక పూజలు కూడా జరిపిస్తున్నారు.
అమ్మా !🌻💐
జన్మదిన శుభాకాంక్షలు 🌷🌸క్వరెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా..
నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ 🙏
అభినందనలతో …. శంకరబాబు pic.twitter.com/DF6FS1eP3p
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 29, 2022
Advertisements