మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కుతోన్న ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ ‘భోళా శంకర్’. తెలుగు నూతన సంవత్సరాది, ఉగాదిని పురస్కరించుకుని ‘భోళా శంకర్’ మేకర్స్ న్యూ అప్డేట్ ఇచ్చారు.
‘భోళా శంకర్’ చిత్రాన్ని 11 ఆగస్ట్, 2023న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ కూడా తెలుగుదనం ఉట్టిపడేలా.. ఆసక్తికరంగా ఉంది.
ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ కుర్తా, షేడ్స్‌లో హ్యాండ్సమ్‌గా కనిపించగా.. రాయల్ చైర్‌లో ఒకవైపు కీర్తి సురేష్, మరో వైపు తమన్నాలు ట్రెడిషనల్ వేర్‌లో దర్జాగా కూర్చుని పండగ కళను తీసుకొచ్చారు.
వారిద్దరూ అలా కూర్చుని ఉంటే.. మధ్యలో చిరంజీవి హుందాగా నిలబడి ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.ఈ చిత్రంలో. తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్.. చిరంజీవి సిస్టర్‌గా కనిపించనుంది.
అక్కినేని సుశాంత్ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నట్లుగా రీసెంట్‌గానే మేకర్స్ తెలిపారు. సత్యానంద్ కథా పర్యవేక్షణ చేస్తున్న ఈ చిత్రానికి తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు.
ఈ మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ఫుల్ స్వింగ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.
‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్రహ్మాండమైన హిట్ తర్వాత మెగాస్టార్ చేస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి. అలాగే ఇప్పటికే విడుదలైన ‘భోళా శంకర్’ ప్రమోషనల్ కంటెంట్ కూడా అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది.