శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తో హీరోగా పరిచయమయ్యాడు సుధాకర్ కొమ్మకుల. ఇటీవల మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఇందువదన కుందరదన అనే సాంగ్ కి తన భార్యతో కలిసి సుధాకర్ డాన్స్ చేశాడు .ఆ వీడియోను చిరు కు గిఫ్ట్ గా ఇచ్చాడు. సుధాకర్ డాన్స్ చూసిన మెగాస్టార్ అభినందిస్తూ ఆడియో సందేశాన్ని సుధాకర్ కు పంపించారు.
హాయ్ సుధాకర్..హారిక ఎలా ఉన్నారు. నా పుట్టినరోజు నాడు మీరు ఇచ్చిన విజువల్ ట్రీట్ కు ధన్యవాదాలు. బ్యూటిఫుల్ గిఫ్ట్. ఆ పాట చూస్తున్నంతసేపు నా గత స్మృతులు చాలెంజ్ డేస్ గుర్తుకు రావటం ఒక ఎత్తయితే…మీరు పాటను ప్రొడ్యూస్ చేయాలన్న ఆలోచన దగ్గరనుంచి ప్రాక్టీస్ చేయడం,సూట్ చేయడం, నాకు పంపించాలన్న ప్రయత్నం ఇవన్నీ మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ సంతోషింప చేశాయి. మీరు ఇండియాలో ఉంటే నా సంతోషాన్ని ఇంకోలా తెలిపేవాడినేమో ఎక్కడో అమెరికాలో దూరంగా ఉన్నారు కాబట్టి ఎలా తెలపాలో తెలియక ఇలా చెప్తున్నాను. సుధాకర్ నువ్వు సినిమా హీరోవి డాన్స్ చేస్తావు. కాబట్టి అది ఊహించగలం. కానీ హారిక ఒక టెకీ. సినిమాకు సంబంధం లేని అమ్మాయి. అయినా కానీ డాన్స్ చేయడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. తన స్టైల్ కు కొంచెం ఎక్కువ మార్కులు వేస్తున్న ఏమీ అనుకోకు. అది కూడా నీ ట్రైనింగ్ అయ్యే ఉంటుంది. మీ దంపతులు ఎలాగైతే చక్కగా డాన్స్ చేసి రక్తి కట్టించారో అలాంటి సమన్వయంతో జీవితంలో కూడా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేలా కొనసాగించాలని నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ చిరు ఆడియో సందేశాన్ని పంపించారు.