110 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ ! - megastar chiranjeevi sye raa movie satellite rights sold for 110 cr- Tolivelugu

110 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ !

సైరా బిజినెస్‌లోనూ సై..రా అంటోంది. క్రేజీ ప్రాజెక్టుపై భారీ అంచనాలతో బిజినెస్ బాగా వర్కవుట్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాంచరణ్ తేజ నిర్మిస్తున్న సైరా నరసింహారెడ్డి టాలీవుడ్, బాలీవుడ్ లలో ఆసక్తి పెంచింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న సైరా టాలీవుడ్‌ ట్రేడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్.

megastar chiranjeevi sye raa movie satellite rights sold for 110 cr, 110 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ !
సైరా డిజిటల్‌, శాటిలైట్‌ రైట్స్ 110 కోట్ల దాకా జరిగినట్లు సమాచారం. సైరా డిజిటల్‌ హక్కులు 40 కోట్లకు పైగా ధర పలికినట్టుగా ఇప్పటికే ప్రచారం జరిగింది. ఇక తెలుగుతో పాటు ఇతర భాషల శాటిలైట్‌ హక్కులు అన్ని కలిపి 70 కోట్లకు పైగా ధర పలికాయంటున్నారు. థియెట్రికల్‌ బిజినెస్‌ భారీ స్థాయిలో జరుగుతుందన్న సమాచారం ఉంది. సైరా సినిమా రిలీజ్‌కు ముందే నిర్మాత రాం చరణ్‌కు లాభాలు తెచ్చిపెట్టడం ఖాయమని టాక్‌ ఉంది.
సైరా భారీ చారిత్రక చిత్రాన్ని సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రాం చరణ్ ఖర్చుకు వెనకాడకుండా 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందించాడు. చిరంజీవి, నయనతార జోడీగా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, సుధీప్‌, జగపతి బాబు, విజయ్‌ సేతుపతి, తమన్నా, రవి కిషన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp