సైరా నరసింహారెడ్డిగా వచ్చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి టీజర్ అందరి అంచనాలను తలదన్నేలా వుంది. ఈరోజు సరిగ్గా 5:31 గంటలకి రిలీజ్ చేసిన ఈ మూడు నిముషాల టీజర్, మెగా ఫాన్స్‌కి సంక్రాంతి ముందు వచ్చే భోగిలా వుంది అంటున్నారు.
ఫైట్ సీన్లు ఎక్కడో ఎప్పుడో చూసినట్టు అనిపించినా, స్క్రీన్ మీద మెగా స్టార్ ఉన్నంతవరకు ఫాన్స్‌కు మిగతా ఏవీ కూడా కనిపించవనే చెప్పాలి.
ఓపెనింగ్‌లో అమితాబ్ బచ్చన్, వెంటనే గుర్రం స్వారీ చేస్తూ చిరు ట్రైలర్ స్థాయిని ఎక్కడికో తీసుకుపోయాయి.
తమన్నా డాన్స్ సీన్లు కాస్త అరుంధతిలో అనుష్క పశుపతితో చేసే డాన్స్-ఫైట్ సీన్‌ను పోలి ఉన్నా, క్రౌడ్ సీన్లు, ఏరియల్ షాట్లు బాహుబలిలా అనిపించినా, ఫైట్ సీన్లలో గుణశేఖర్ రుద్రమదేవి వాసన తగిలినా-మెగా స్టార్ స్క్రీన్ మీదకు రాగానే అన్ని లోపాలూ ఇట్టే మాయం కాక తప్పదు.
36వ సెకండ్ దగ్గర గోడలోంచి దూకే సీన్లో చిరంజీవి అదరగొట్టినా, ఆర్ట్ డైరెక్టర్ ఏదో అలా అలా పనికానిచ్చేశాడని అర్ధమవుతుంది. గ్రాఫిక్స్ వర్క్, మేకింగ్ క్వాలిటీ, విజువల్ డిజైన్ అదిరిపోయింది. అమిత్ త్రివేది మ్యూజిక్ కట్టిపడేస్తుంది. ఒక్కసారి టీజర్ చూస్తే ఆ మ్యూజిక్ మన బ్రెయిన్ లో రిజిస్టర్ కావలసిందే. సినిమాకి పెద్ద ప్లస్ మ్యూజిక్ అవుతుంది.
ట్రైలర్‌లో నయనతార భాగం ఎక్కువ లేకపోయినా, కనిపించినంతవరకు ఆమె కరెక్ట్ కాస్టింగ్ అనిపించేలా వుంది. 2:19 దగ్గర చిరంజీవితో పాటు, కిచ్చ సుదీప్, ఇంకా మిగతా ఫైటర్స్ నుంచున్న సీన్ అవెంజర్స్ పోస్టర్‌లా అదిరిపోతుంది.
2 :26 దగ్గర ఒక్క సెకండ్ మెరిసే నిహారిక కొణిదెల యుద్ధ భూమిలో దూసుకుపోవడం బావుంది.
కావాల్సినంత దేశభక్తి, 60 ఏళ్ళలోను తగ్గని మెగాస్టార్ ఎనర్జీ, “గెట్ అవుట్ ఫ్రామ్ మై మదర్ ల్యాండ్” అని హై ఇంటెన్సిటీ మెగాస్టార్ డైలాగ్.. ఇవి చాలు సినిమా ఒక రేంజ్‌లో ఉంటుందని చెప్పడానికి. ఇక 2nd అక్టోబర్ కోసం ఫాన్స్ ఫుల్ లెన్త్ ఫీస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు!
Here is the link to the most awaited Sye Raa trailer