సైరా నరసింహారెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు మెగా స్టార్ చిరంజీవి. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. అయితే తాజాగా ఓ వార్త వైరల్ అవుతుంది. సంచలన డైరెక్టర్ శంకర్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శంకర్ మొదటి చిత్రం జెంటిల్ మెన్ హిందీ రీమేక్ లో చిరంజీవి నటించారు. అల్లు అరవింద్ నిర్మాతగా 1993లో వచ్చిన ఆ మూవీకి బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ దర్శకత్వం వహించారు. కాగా ఇప్పుడు చిరంజీవి – శంకర్ కలయికలో ఓ సినిమా చేయాలనీ అగ్ర నిర్మాతలు పోటీ పడుతున్నారట.
దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ టాలీవుడ్ లో ప్రముఖంగా వినిపిస్తుంది. ఇక చిరు ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది.