మెగాస్టార్ చిరంజీవి – మాస్ మహారాజ రవితేజ కలిసి నటించిన తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. చాలా కాలం తర్వాత చిరంజీవి నటిస్తున్న మాస్ మసాలా మూవీ ఇది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ అదిరిపోయాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్.
పూనకాలు లోడింగ్.. పూనకాలు లోడింగ్.. అంటూ ఇప్పటికే వాల్తేరు వీరయ్య మూవీ టీమ్ చెప్పినట్టుగా.. ట్రైలర్ అద్భుతంగా ఉంది. మెగా ఫ్యాన్స్ కి కావాల్సిన అన్ని యాక్షన్, డైలాగ్స్, కామెడీ ఇలా అన్ని ఎలిమెంట్స్ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి.
‘మీ కథలోకి నేను రాలే.. నా కథలోకే మీరందరూ వచ్చారు. వీడు నా ఎర.. నువ్వే నా సొర’ అంటూ చిరు మాస్ డైలాగ్స్ తో అదరగొట్టేశారు. ‘ఇక ప్రచార చిత్రం చివర్లో రికార్డుల్లో నా పేరు ఉండటం కాదు.. నాపేరు మీదే రికార్డ్స్ ఉంటాయి’ అంటూ కేక పెట్టించారు.
ఇక ట్రైలర్ లో ‘వైజాగ్ లో గట్టి వేటగాడు లేడని ఒక పులి పూనకాలతో ఊగుతుందట’ అంటూ రవితేజ ఎంట్రీ అదిరిపోయింది. ‘ఒక్కొక్కడికి బాక్సులు బద్ధలైపోతాయి’ అంటూ చిరంజీవికే వార్నింగ్ ఇస్తూ కనిపించారు. మొత్తానికి ట్రైలర్ తోనే ఫ్యాన్స్ కి పూనకాలు వస్తాయన్నది మాత్రం గ్యారెంటీ అని చెప్పవచ్చు.
కాగా ఈ సినిమాకి కేఎస్ రవీంద్ర దర్శకత్వం వహించగా, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. దేవీ శ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందించారు.