భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖ దర్శకులలో ఒకరైన కాశీనాధుని విశ్వనాథ్ 92వ పుట్టినరోజు నేడు. చిరంజీవి, శుభలేఖ సుధాకర్, మమ్ముట్టి, కృష్ణ, చంద్ర మోహన్, రోజా రమణి, వాణిశ్రీ వంటి ప్రముఖులతో సహా చాలా మంది నటులకు కెరీర్ ను ఇచ్చిన గొప్ప దర్శకుడు కె విశ్వనాథ్.
అయితే ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని, మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నటుడు విశ్వనాథ్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఆయనతో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చారు.
ఇక శుభలేఖ, ఆపద్బాంధవుడు, స్వయంకృషి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన హిట్ చిత్రాలు. కళా తపస్వి విశ్వనాథ్ ఆడియోగ్రాఫర్ నుండి ఫిల్మ్ మేకర్‌గా మారారు.
అతని మొదటి చిత్రం, ఆత్మ గౌరవం 1965 లో రిలీజ్ అయింది. అలాగే ఆయన కెరీర్ లో ఎన్నో అవార్దులను సైతం అందుకున్నారు కె విశ్వనాథ్.