ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారు టాలీవుడ్ హీరోలు. చిన్న హీరో పెద్ద హీరో అని తేడా లేకుండా మల్టీస్టారర్ వైపే అడుగులేస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ ఒక అడుగు ముందున్నాడనే చెప్పాలి. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, నాగ చైతన్య, వరుణ్ తేజ్ లాంటి హీరోలందరితోను చేశాడు. మహేష్ బాబుతో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ , పవన్ కళ్యాణ్ తో ‘గోపాల గోపాల, చైతుతో వెంకీ మామ, వరుణ్ తో ఎఫ్ 2 సినిమాయూ చేసి హిట్ అందుకున్నాడు.
తాజాగా వెంకీ బాటలోనే మరికొంత మంది సీనియర్ హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమా చేయాలని చూస్తున్నారట. ఇప్పటికే నాగార్జున నాని తో కలిసి దేవదాస్ సినిమాతో ముందుకొచ్చాడు. ఇక త్వరలో మెగాస్టార్ చిరంజీవి కూడా మల్టీ స్టారర్ తో రాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆయన రానాతో కలిసి మల్టీ స్టారర్ చిత్రం చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం. బాబీ సిద్ధం చేసిన కథలో ఇద్దరు హీరోలకి ప్రాముఖ్యత ఉండగా, ఇందులో చిరంజీవి లీడ్ రోల్ పోషిస్తారని, రెండో హీరోగా రానా కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది.