పవర్ స్టార్… మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఫీల్డ్‌కు వచ్చినా, చిరుతో సమానంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే… అన్నదమ్ముల రాజకీయ నిర్ణయలు చెరో దారిలో ఉండటంతో గ్యాప్ ఉంది అన్న ప్రచారం జరిగినా, ఏ మాత్రం అవకాశం దొరికినా ఆ గ్యాప్ లేదు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటారు అనేది ఇండస్ట్రీ టాక్.
అయితే, హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం అర్జున్ సురవరం. ఎన్నో సార్లు వాయిదా పడుతూ… రిలీజ్ అవుతుందో లేదో అనుకున్న సమయంలో ఎట్టకేలకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసుకుంది. అయితే ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన మధు… గతంలో చిరు ఠాగూర్ సినిమాకు ప్రొడ్యూసర్. దాంతో చిరు ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా హజరయ్యారు.
ALSO READ : మార్కెట్‌లోకి కొత్తగా వైసీపీ గేదెలు
అయితే… ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో నిఖిల్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నేను చూశా… నిఖిల్ బాగా చేశాడు, కొన్ని సన్నివేశాలు విప్లవ వీరుడు చేగువేరాకు సంబంధించి ఉన్నాయి. ఎందుకో చే గువేరాను చూస్తే నా తమ్ముడు పవన్ గుర్తుకు వస్తాడు అంటూ… పవన్ కళ్యాణ్ స్టైల్లో చెప్పాడు చిరు. దీంతో అక్కడ అభిమానులంతా ఉత్సాహాంతో ఊగిపోయారు.
ఈ సినిమాలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి నటించారు.