ఈ మధ్య కాలంలో అతి తక్కువ రేటింగ్స్, నెగెటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన చిత్రం వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇంకా ముందుకు దూసుకుపోతూంది. సోషల్ మీడియా బాగా వృద్ధిలోకి వచ్చిన తరువాత రివ్యూస్ ప్రాముఖ్యత బాగా తగ్గిపోయింది.
కొన్ని మీడియా సంస్థలు వాల్తేరు వీరయ్య సినిమాకి 2.25 రేటింగ్ ఇచ్చాయి. ఆదివారం అమెరికా మొత్తం వాల్తేరు వీరయ్య సినిమాకి సంబంధించి స్పెషల్ ఫ్యాన్స్ షోస్ ని ఏర్పాటు చేసుకున్నారు. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే షోకి విరామం సమయంలో చిరంజీవి వెండితెర మీద జూమ్ కాల్ ద్వారా అభిమానులతో కాసేపు ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఆయన వాల్తేరు వీరయ్య చిత్రానికి కొన్ని మీడియా సంస్థలు ఇచ్చిన రివ్యూస్ కి రేటింగ్స్ గురించి తనదైన శైలిలో సెటైర్లు వేశారు.
ఆయన మాట్లాడుతూ ‘చిన్న జోక్ చెప్తాను.ఎవ్వరిని కించపర్చడానికి కాదు. టేక్ ఇట్ ఈజీ ! కొన్ని వెబ్ సైట్స్ 2.25 అలా రేటింగ్ ఇచ్చాయి.
వాళ్లు ఇచ్చిన రేటింగ్ ఏమిటో తెలుసా 2.25 అంటే .. మిలియన్స్ అని.. 2.25 మిలియన్స్ అని తర్వాత అర్థం అయింది’ అంటూ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.