మెగాస్టార్ చిరంజీవి.. ఈ వ్యక్తి సినీ అభిమానులకే కాదు ఎంతో మంది స్టార్ హీరోలకు కూడా ఇష్టమైన వ్యక్తి. చిరంజీవి ని ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నవారు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన సినిమాలు, ఆయన సినిమాల్లోని పాటలు రీమేక్ చేస్తూ ఉంటారు. అయితే మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ పై ఇప్పుడు సూపర్ స్టార్ మహీష్ బాబు ఫోకష్ పెట్టినట్టు తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ సినిమా టైటిల్ మహేష్ తన తర్వాతి సినిమాకి పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోందట.ప్రస్తుతం ఇదే విషయమై సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ ఇదే నిజం అయితే మెగా, సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఆనందం ఒకటికి రెండింతలు ఎక్కువ అవుతుందని చెప్పాలి. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు.