మెగాస్టార్ మళ్ళీ ఆ తప్పు చేయలేదు!

కోట్లాదిమంది మెగాభిమానులకే కాదు.. అరడజను మంది మెగా హీరోలకు సైతం ఈ మెగాస్టారే దేవుడు. ఆయన కరిష్మా కేంద్రంగానే తెలుగు చిత్రసీమలో మెగా మర్రిచెట్టు ఇంతలా ఊడలు దిగింది. సొంత కష్టంతో, వ్యక్తిగత స్టామినాతో, ఏ ఒక్కరి ప్రాభవాన్ని, ప్రభావాన్ని తన మీద పడకుండా ఇంతెత్తుకు ఎదిగిన చిరంజీవి ప్రస్థానమే వీళ్ళందరికీ మార్గదర్శకం. ఈరోజుకీ మెగా నవతరానికి ఉత్సాహాన్ని నూరిపోస్తూ ముందుకు నడిపిస్తుంటారు చిరంజీవి. కెరీర్ అనేది హిట్లకు, ఫ్లాపులకు అతీతమని, పొంగిపోవడం-కుంగిపోవడం కూడదని బేసిక్ ప్రిన్సిపుల్స్   బోధిస్తూ నైతిక స్థైర్యాన్ని నింపడం మెగాస్టార్ కి అలవాటుగా వస్తోంది. ఈ క్రమంలో ఆయన తనకు తెలీకుండానే కొన్ని తప్పిదాలకు పాల్పడ్డట్టు దాఖలాలున్నాయి.
మగధీర.. 2009లో విడుదలైన ఒక టాలీవుడ్ అద్భుతం. అప్పటివరకూ వున్న అనేక రికార్డులను తిరగరాసింది. అప్పుడప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్న మెగా తనయుడు రామ్ చరణ్ కి ‘మగధీర’ నిజంగానే బిగ్ బ్రేక్. వసూళ్ల పరంగా తిరుగులేని విజయం సాధించిన ఈ సినిమా  సక్సెస్ ని మెగా ఫ్యామిలీ అమితంగా ఎంజాయ్ చేసింది. అయితే ఆ మోతాదు మరీ పెరిగిపోయి చివరికి వికటించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. విజయోత్సవంలో పాలుపంచుకున్న చిరంజీవి.. మగధీర క్రెడిట్ అచ్చంగా చెర్రీకే దక్కుతుందని.. అతడి పెర్ఫామెన్స్ అంత మేరకు ఉందని సర్టిఫై చేశారు. ఈ మెగా వెర్షన్ మీద.. చాలా విమర్శలు పడ్డాయి. ఆ తర్వాత దర్శకుడు అలిగినట్లు, చెర్రీకి కొమ్ములు మొలిచినట్లు రకరకాల వార్తలొచ్చాయి. తర్వాత ఆ గొడవ ఎలాగోలా సర్దుమణిగింది.
కట్ చేస్తే.. ఇప్పుడు తొలిప్రేమ 2.0. మెగా తమ్ముడు పవన్ కళ్యాణ్ ని నిలబెట్టి, ఆయన కటౌట్ సైజుల్ని పెంచేసిన మూవీ కరుణాకరన్ ‘తొలిప్రేమ’. దాదాపు 20 ఏళ్ల తర్వాత అదే పేరుతో పవన్ అన్న కొడుకు వరుణ్ తేజ్ హీరోగా వెంకీ అట్లూరి మరో ప్రయత్నం చేశారు. ఆశించిన దానికంటే మంచి విజయం సాధించి.. పవర్ స్టార్ పేరు నిలబెట్టిన మూవీ అంటూ ప్రశంసలు దక్కించుకుంటోంది. ఈ సక్సెస్ గురించి తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవి.. సినిమా యూనిట్ మొత్తాన్ని ఇంటికి పిలిచి అభినందన కార్యక్రమం షురూ చేశారు. ‘తొలిప్రేమ సినిమా మెగా కుటుంబం గర్వపడేలా వుంది. వరుణ్ తేజ్ చాలా మెచ్యూర్డ్ గా చేశాడు. నాగబాబుకు గర్వకారణంగా నిలబడ్డాడు” అంటూ తెగ పొగిడేశాడు. అదే సమయంలో.. మిగతా యూనిట్ మొత్తాన్నీ కూడా ఆత్మీయంగా కౌగలించుకున్నారు. శాలువాలు కప్పి చిన్న సైజు సన్మానం చేసుకున్నారు.
మిగతా మెగా హీరోలతో పోలిస్తే వరుణ్ తేజ్ ‘డౌన్ టు ఎర్త్’ టైపు. మాటలో గానీ, మోహంలో గానీ గర్వమనే ఛాయలే కనిపించవు. కానీ.. వరుస హిట్లు పడుతున్న ఇటువంటి సీజన్లో వరుణ్ ‘బ్యాలెన్స్’ తప్పకూడదని, అతడు అతడిలాగే ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమా అనేది.. ఒక సమిష్టి ప్రయత్నం. ఆర్టిస్టుల నటనతో పాటు అనేకమంది సృజన తోడైతేనే వెండితెర మీద విజయం దక్కేది. కథ, కాన్సెప్ట్, మేకింగ్, మ్యూజిక్, డైరెక్షనల్ టాలెంట్, ఆర్టిస్ట్ పెర్ఫామెన్స్ అన్నీ కలగలిస్తేనే ‘సినిమా’. అందుకే.. సక్సెస్ క్రెడిట్ మొత్తం హీరోకే ఆపాదించే మొరటు సంప్రదాయానికి ఫుల్ స్టాప్ పడాలన్నది సగటు సినీ గోయర్ భావన.

మగధీర రిపీట్? మెగాస్టార్ మళ్ళీ ఆ తప్పు చేయలేదు!