పుట్టినరోజు సందర్భంగా విక్టరీ వెంకటేష్ సినీ ప్రముఖలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్‌ను విష్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు.
ప్రియమైన వెంకీ.. హ్యాపీ బర్త్ డే. సరదగా ఉంటూనే… లోతైన అధ్యాత్మికతను ప్రదర్శించే నిన్ను చూస్తే నాకెంతో అనందంగా ఉంటుంది. నారప్ప లుక్ ఎంతో బాగుంది. గట్టి ప్రభావాన్ని చూపుతుందని అనుకుంటున్నా. ఈ సంవత్సరం నీకు అన్ని విజయాలే చేకూరాలని.. మరో విజయం దక్కాలని కోరుకుంటున్నా అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
Dearest @VenkyMama Happy Birthday! 💐I am always delighted at how you are as fun loving as you are profound & spiritual! Your #Narappa looks intense and makes a strong impact! May you have a great year ahead & savor another memorable success! pic.twitter.com/swGaIBnByG
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 13, 2020
Advertisements