రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించనున్నాడు. మరో వైపు రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ లు, ఎన్టీఆర్, చరణ్ ల లుక్ లు సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాయి.
ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ పాత్రల పరిచయం కి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అలాగే హిందీలో అమీర్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడట. అగ్రహీరోలు ఇద్దరి వాయిస్ అయితే బాగుంటుందని రాజమౌళి భావిస్తున్నారట. మరోవైపు తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఎవరితో చెప్పిస్తే బాగుంటుందనే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.