హీరోయిన్ మేఘా ఆకాష్ తల్లి నిర్మాతగా మారబోతోందనే విషయం ఆమధ్య బాగా వైరల్ అయింది. ఇప్పుడా ప్రాజెక్టు సెట్స్ పైకి వచ్చింది. మేఘా ఆకాష్ హీరోయిన్ గా, ఆమె తల్లి బిందు ఆకాష్ సమర్పణలో కొత్త సినిమా మొదలైంది. యువ హీరో రాహుల్ విజయ్ హీరోగా నటిస్తుండగా.. రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు.
ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. కోట ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఎ సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి కథను అందించగా… అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఇంతకు ముందు ఇతడు డియర్ మేఘ చిత్రానికి పనిచేశాడు. అందులో అతడి వర్క్ చూసి, మేఘా ఆకాష్ అభిమన్యును దర్శకుడిగా పరిచయం చేస్తోంది.
ఇదొక మంచి కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. అందుకే తన తల్లిని నిర్మాతగా కూడా మార్చేసింది మేఘ.
ఇదొక రొమాంటిక్ ఎంటర్ టైనర్ సినిమా. ఇందులో వెన్నెల కిషోర్ కూడా ఓ మంచి పాత్ర పోషిస్తున్నాడు. హైదరాబాద్ లో 15 రోజులు, గోవాలో 10 రోజులు షూటింగ్ చేయబోతున్నారు. అలా 25 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.