ఆర్టీసి కార్మికులను అస్సలు పట్టించుకోకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడానికి ప్రధాన కారణం ఆర్టీసి కి చెందిన భూములేనా?? నిజమే అంటున్నారు ఆర్టీసి నాయకులు.తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా ఆర్టీసీకి 1375 ఎకరాల భూమి ఆయా దిపొ ల పరిధిలో ఉంది.ఈ భూముల విలువ మార్కెట్ ధర ప్రకారం అంచనా వేస్తే 30వేల కోట్లకు పై మాటే అంటున్నారు ఆర్టీసీ నాయకులు.
ఒక్క హైదరాబాద్ బస్ భవన్ దగ్గర భూమి ధర దాదాపు 400 కోట్లు పలికే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ భూముల మీద కన్నుపడే ఆర్టీసీని మేఘ కు అప్పగిస్తే , మొత్తం భూములను వాడుకోవచ్చు అన్నది ఈ భూ బకాసురుడు మాస్టర్ ప్లాన్ వేశాడని ఆర్టీసీ కార్మికులు అంటున్నారు.
అదే సమయంలో ప్రభుత్వం కూడా ఆర్టీసీ ఆస్తుల విలువ తక్కువగా చూపిస్తూ అసలు ఏమి లేదు అని ప్రజల్లోకి తప్పుడు సమాచారం పంపిస్తున్నా రని మండిపడుతున్నారు. మంత్రులు, ముఖ్యమంత్రి చెప్పే లెక్కలకు పొంతన లేదంటున్నారు. ఇదంతా చూస్తుంటే ఆర్టీసి నీ ప్రైవేట్ పరం చేసి , ఆర్టీసీ భూములను లాక్కునే భయంకర కుట్ర దాగుందని ఆర్టీసీ నాయకులు అంటున్నారు