కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ రైతంగానికి రెండు పూటల తిండి పెట్టింది లేదు. అదనంగా ఇప్పటి వరకు ఒక్క చుక్క నీరు తెలంగాణ బీడు భూములకు పారిందీ లేదు. కానీ… ప్రాజెక్ట్ కట్టిన కాంట్రాక్టర్ మెఘాను మాత్రం అపర కుభేరున్ని చేసింది. ఒకే ఒక్క ప్రాజెక్ట్ మెఘా తలరాతను బంగారంలా మార్చేసింది.
అవును.. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే ఉద్దేశంతో ప్రభుత్వం చేసిన రీడిజైనింగ్ మెఘా సంస్థకు కాసుల పంట పండించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలక పనులు చేసిన మెఘా సంస్థ దేశంలోని ధనవంతుల జాబితాలో మరింత ముందుకు దూసుకొచ్చింది. దేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ యజమాని 47 వ స్థానం నుండి 39 వ స్థానానికి చేరుకోవటం గమనార్హం. అంటే ఒకే ఒక్క ప్రాజెక్ట్ వల్ల 8 స్థానాలు ఎగబాకరన్నమాట.
కాళేశ్వరం ప్రాజెక్ట్ అనగానే తెలంగాణ ప్రజలకు టక్కున గుర్తొచ్చేది మెఘా కృష్ణా రెడ్డి. 34 వేల కోట్ల అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి . కాంట్రాక్టర్ మెఘా కృష్ణా రెడ్డి ప్రభుత్వ పెద్దలు పంచుకు తిన్నారని విపక్షాలు , సాగునీటి ప్రాజెక్ట్ ల నిపుణులు ముందు నుంచి విమర్శిస్తున్నారు . కావాలనే రీడిజైనింగ్ పేరుతో మెఘాకు ప్రాజెక్ట్ కట్టబెట్టి వేల కోట్లు కట్టబెట్టారని ఆరోపణలు ఉన్నాయ్. ఇప్పుడు ఫోర్బ్స్ విశ్లేషణ ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి వాస్తవమనే టాక్ నడుస్తోంది. ఒక్క సాగునీటి ప్రాజెక్టు తో దేశ ధనవంతుల జాబితాలోముందు కు వెళ్లడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణాలో ఇప్పుడు ఇదో పెద్ద చర్చ. తెలంగాణ ప్రజల రక్త మాంసాలతో , వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన మెఘా కృష్ణా రెడ్డి బాగోతం బయట పడాల్సిందే అని రాష్ట్ర ప్రజలు చర్చిందుకుంటున్నారు .ఐటి రైడ్స్ లో అవినీతి సొమ్మంతా బయటపడాలని కోరుకుంటున్నారు.
ఒక్క కాళేశ్వరంతోనే టాప్ 50లోకి వచ్చేస్తే… పోలవరం ప్రాజెక్ట్, తెలంగాణ-ఆంద్రా ప్రాంత ముఖ్యమంత్రులు చేస్తోన్న గోదావరి-కృష్ణా నదుల అనుసంధాన ప్రాజెక్ట్ కూడా మెఘానే చేస్తే టాప్10లోకి రావటం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.