మియాపూర్ టు ఒలెక్ట్రా వయా ప్రగతిభవన్… ఇదేదో బస్ రూట్ అనుకుంటున్నారా…? బస్ రూట్ అయితే కాదు కానీ, బస్సులకు-మియాపూర్‌కు- ప్రగతిభవన్‌కు సత్సంబంధాలున్నాయని తెలుస్తోంది. మియాపూర్ భూముల కుంభకోణం దగ్గర నుండి నేటి ఆర్టీసీ గ్రీన్‌టెక్ ఎలక్ట్రిక్ బస్సుల వరకు జరిగిన అవినీతి పంపకాల బాగోతమిది.
మియాపూర్‌లో భూముల కుంభకోణం జరిగింది. ఆ కేసులో గోల్డ్‌స్టోన్ ప్రసాద్ సూత్ర, పాత్రదారి. కేసు నమోదు చేశారు… కానీ కేసు ఇక ఏమైందో తెలియదు. కానీ అప్పట్లో ఆ విషయంలో భూమికి ఏమైంది… ఎడున్నదో ఆన్నే ఉన్నది అని కొట్టిపారేశారు సీఎం. 500-600కోట్ల కుంభకోణం అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ సడెన్‌గా కేసు సైలెంట్ అయిపోయింది.
సీన్ కట్ చేస్తే… గోల్డ్‌స్టోన్ ప్రసాద్ కంపెనీ అయిన ట్రినీటీ ఇన్‌ఫ్రావెంచర్స్ కంపెనీని మెఘా సంస్థ టేకోవర్ చేసింది. అయితే… అందరికీ వచ్చే డౌటే ఇక్కడ వచ్చింది. మియాపూర్ భూముల కుంభకోణం అనంతరం మెల్లగా కేసు సైలెంట్ కావడానికి, మెఘా టేకోవర్ చేయడానికి మద్య జరగాల్సిందే జరిగింది. అందుకే రాత్రికి రాత్రి ట్రీనీటీ ఇన్‌ఫ్రావెంచర్స్ మెఘా చేతికి వెళ్లిపోయింది. అందులో ఎవరి ఒత్తిడి ఉందో, మెఘా ఆత్మబందు తెలంగాణ ప్రభుత్వ పెద్ద జోక్యం ఎంతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే… అలా గోల్డ్‌స్టోన్ ప్రసాద్ కంపెనీ కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన మెఘా చేతికి వెళ్లిపోయింది. ఆ తర్వాత కంపెని పేరు ఓలెక్ట్రా గ్రీన్‌టెక్‌గా మారిపోయింది. ఈ కంపెనీలో ప్రధాన వాటాదారుడు ప్రసాద్‌కు మైనర్ షేర్ మిగిలిపోగా, 50శాతానికి పైగా కంపెనీ మెఘా పరం అయింది.
కొత్త కంపెనీల్లో పామిరెడ్డి రమారెడ్డి, పామిరెడ్డి పిచ్చిరెడ్డి తదితరులు డైరెక్టర్లుగా ప్రస్తుతం ఉన్నారు. ఈ ఒలెక్ట్రా ద్వారానే మెఘా అండ్ కో ఆర్టీసీలోకి అడుగుపెట్టింది. మొదట్లో 40 బస్సులే సప్లై చేసినా… రెండో ఫేజ్‌లో 300కు పైగా బస్సులను సప్లై చేయబోతున్నారు. క్రమక్రమంగా ఆర్టీసీలో ప్రైవేటు ఆదిపత్యం పెంచే ఉద్దేశ్యమే ఇదని, తద్వారా… రానున్న రోజుల్లో ఎంతో విలువైన ఆర్టీసీ భూములను తమ పరం చేసుకోవాలన్నదే అంతిమ లక్ష్యమని ఆర్టీసీ కార్మిక సంఘాలంటున్నాయి.