- కాలేజీ కబ్జా సరికాదన్న పి.పి.రెడ్డి
- ఎవరిదో కష్టార్జితాన్ని ఆక్రమించడం అనైతికమన్న మేనమామ
- కబ్జాలతో వ్యాపారం విపరీతంగా పెరుగుతుందన్నకృష్ణారెడ్డి
- టీవీ9 కబ్జా చేసి మీడియా బలంతో 30వేల కోట్ల కాంట్రాక్టులు
- సంపాదించుకున్న మేనల్లుడు
- రెండు వేల కోట్ల ఆస్తి రెండు వందల కోట్ల పెట్టుబడితో ఆక్రమిస్తే..
- ఈ అత్యాశే మేఘా కృష్ణారెడ్డిని ఎన్.ఆర్.ఐ. మెడికల్ కాలేజ్ ఆక్రమణకు పురిగొల్పిందా!
అసలీ కథ ఏంటి..?
క్రైంబ్యూరో, తొలివెలుగు: 24 మంది ఎన్నారై డాక్టర్లు..సీనియర్ సిటిజన్స్ జీవితాంతం కష్టపడి సంపాదించిన పెట్టుబడితో ఎన్.ఆర్.ఐ. మెడికల్ కాలేజీ మొదలు పెట్టారు. ఇది కాలేజీ కాదు. ఎంతోమంది ఎన్నారైల కల.. విదేశాల్లో మంచి జీతాలతో జీవితం హ్యాపీగా గడుపుతున్నప్పటికీ, జన్మనిచ్చిన గడ్డ రుణం తీర్చుకునేందుకు పూనుకున్నారు కొందరు ఎన్నారైలు. 2003లో మంగళగిరికి దగ్గరలోని చినకాకానిలో 50 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్ కాలేజీ అనుమతులు తీసుకున్నారు. ఎక్కడెక్కడ హై ప్రొఫైల్ ప్రొఫెసర్స్ ఉన్నారో వారందరినీ ఎక్కువ జీతాలు ఇచ్చి తెచ్చుకుని, కాలేజ్ లో స్టాఫ్ గా నియమించుకున్నారు. మొదటి ఏడాదిలోనే సూపర్ రిజల్ట్స్ వచ్చాయి. ఐదేళ్ల తర్వాత స్టూడెంట్స్ సంఖ్య పెరిగింది. పీజీ కోర్సులకు అనుమతులు వచ్చాయి. ఎన్నారై కాలేజ్ లో మెడికల్ సీట్ దొరకాలంటే అదో బ్రహ్మాండం అనుకునేవారు. ఏడేళ్లలోనే రోజుకు వెయ్యి మంది రోగులకు వైద్యం అందించే స్థాయికి హాస్పిటల్ ఎదిగింది. సౌకర్యాలు కూడా ఆ స్థాయిలో పెంచాలన్న ఉద్దేశ్యంతోనే భాగస్వాముల సంఖ్య కూడా 30కి పెరిగింది. 2015 వరకు మెడికల్ రంగంలో తిరుగులేని సంస్థగా ఎదిగింది. కాని 2015 నుంచి 2019 మధ్య కాలంలో కబ్జా కుట్రలకు తెరతీశారు కొందరు ప్రబుద్దులు. ఏం చేస్తే బంగారం లాంటి ఎన్నారై కాలేజీ, హాస్పిటల్ దక్కుతాయోనని నాలుగేళ్ల పాటు కుట్రలు పన్నారు. వీలైనన్నిస్కెచ్చులేసి.. హ్యాప్పీగా కబ్జా చేసి దర్జాగా ఉందమనుకున్నారు.
కబ్జా కథ ఏంటంటే..?
మెడికల్ ఎంట్రెన్స్ శిక్షణలో మంచి పేరున్న శ్రీచైతన్య కాలేజ్ ఎన్నారై కాలేజీ కావాలని కోరుకుంది. దీంతో అప్పటి ప్రభుత్వ పెద్దలకు గిఫ్టులు ఇచ్చి పనులు చేయించుకునే అలవాటున్నలింగమనేని రమేష్ 2015లో మధ్యవర్తిత్వం చేశారు. ఇంకేముంది 8 మంది డైరెక్టర్స్ కి 11 కోట్ల చొప్పున సుమారు 100 కోట్లు చేతులు మారాయి. జనరల్ బాడీ మీటింగ్ లోకి ఎవరిని రానివ్వకుండా రూల్స్ కు విరుద్దంగా వ్యవహరించారు. కానీ 18 మంది మెజార్టీ సభ్యులు ఎదురు తిరిగారు. దీంతో డీల్ బెడిసి కొట్టింది. 2018లో వ్యవస్థాపకుల పాలక మండలి ఏర్పాటైంది. కాని 30 మంది డైరెక్టర్స్ లో విభేదాలు అలాగే ఉండటంతో.. లింగమనేని పథకాన్ని మార్చాడు. మేఘా కృష్ణారెడ్డి, లింగమనేని మధ్య అప్పటికే బిజినెస్ డీలింగ్స్ ఉండటంతో 2వేల కోట్ల విలువ చేసే కాలేజీని 200 కోట్లతో కబ్జా చేయవచ్చనీ..మిగతా డైరెక్టర్స్ ని కూడా కొనుగోలు చేయవచ్చని సుబ్బయ్య అనే డైరెక్టర్ తో చేతులు కలిపారు. దీంతో 2019 నుంచి మేఘా కృష్ణారెడ్డి అధికార బలంతో.. పోలీసుల పై ఒత్తిళ్లతో తమను కాదన్నవారిపై అక్రమంగా కేసులు బనాయించారు. కరోనా కాలంలో అల్లకల్లోలం సృష్టించారు.
మెజార్టీ సభ్యులు మేఘాకు వ్యతిరేకమే!
మేఘా సంస్థ అక్రమంగా చొరబడేందుకు 12 మంది సభ్యులను రూ.14 కోట్ల చొప్పున ఇచ్చి తనవైపు తిప్పుకుంది. అయితే.. అందులో రూల్స్ కు విరుద్ధంగా నియామకం అయినవారే ఎక్కువగా ఉన్నారు. అప్పటికే కోవిడ్-19 కేసులు పెరగడం.. ఎన్నారైకి మరింత మంచి పేరు రావడంతో మేఘా డీల్ ని వదులుకోలేకపోయారు.కాలేజ్ పై పట్టు పెంచుకోవాలని చూశారు. అనధికారికంగా సీఈవోలను నియమించారు. కొత్త సీఎఫ్ఓని నియమించుకున్నారు. 2020లో జనరల్ బాడీ మీటింగ్ లో పాత కమిటీ మళ్లీ ఎన్నికైంది. 2022 మార్చి వరకు ఇది కొనసాగాలి. కాని అలా చేయకుండా అక్రమ కేసులు బనాయించి డాక్టర్ శ్రీనివాస్ ని అరెస్ట్ చేయించారు. దీంతో ఆగకుండా అక్రమంగా మరో పాలక మండలిని నియమించారు. ఆ ఎగ్జిక్యూటివ్ బాడీలో ముగ్గురు సభ్యులు అనర్హులే. ఒకరు సి.ఎ. అయితే మరొకరు లింగమనేని న్యాయవాది. డబ్బుల వ్యవహారం చూసే ట్రెజరర్ సీటీ చౌదరిని సభ్యుడుగా అర్హుడు కాదని సివిల్ కోర్టు తీర్పునిచ్చింది. కానీ.. అతన్నేకోశాధికారిగా కొనసాగించడంతో చాల మంది సభ్యులు వ్యతిరేకించారు. వీరి మధ్య గోల్ మాల్ వ్యవహారం అంతా సినిమాలో క్లైమాక్స్ ని తలపించింది. కానీ..నీతి, నిజాయితీలు ఎప్పటికీ ఓడిపోవని చరిత్ర చెప్తోంది. అందుకే..మెజార్టీగా ఉన్న 18 మంది డైరెక్టర్స్ కి ఇప్పుడు న్యాయం జరుగుతోంది.
కష్టార్జితం కోసం సీనియర్ ల పోరాటం
ఏడేళ్ల వనవాసం కొనసాగించిన సీనియర్స్ పోరాటం ఫలించింది. ఆర్బిట్రేట్ ట్రిబ్యునల్ అదేశాల మేరకు జస్టిస్ దేవేందర్ గుప్తా నివేదిక ఎంతో మేలు చేసింది. రిటైర్డ్ డీజీపీ మండవ విష్ణువర్దన్ రావుని అడ్మిన్ ఆఫీసర్ గా నియమించారు. దీంతో నిధుల గోల్ మాల్ నుంచి మొదలుకొని కబ్జా వ్యవహారాల సమాచారాన్ని సేకరించారు. కొంత మందిని ఉద్యోగం నుంచి తొలగించారు. తప్పిదాలు చేసిన మరి కొంత మంది పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేశారు.
రక్షణకు కదిలిన కోర్టు
ఈ వ్యవహారం అంతా నిత్యం కోర్టుల చుట్టే తిరుగుతోంది. పోలీసులు అక్రమంగా కేసులు పెట్టి జైల్లో ఉంచారు, కానీ.. సివిల్ మ్యాటర్ కావడంతో మెజార్టీ డైరెక్టర్స్ కి అనుకూలంగానే తీర్పులు వెలువడుతున్నాయి. కోర్టు హాలిడేస్ ఉన్నసమయంలోనే నిజాలను దాచిపెట్టి నూజివీడ్ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. చెంప చెళ్లుమనేలా అమరావతి హై కోర్టు ఈ తీర్పును సెటిసైడ్ చేసింది. ఆర్బిట్రేట్ ట్రైబ్యునల్ పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన మేఘా సంస్థ.. స్టే కి నిరాకరించింది. జూలై 12 కి వాయిదా వేసింది ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం. దీంతో తమకు అండగా, రక్షణ కవచంగా కోర్టులు నిలిచాయని అమెరికా డాక్టర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నిజాలు తెల్సుకుని నీతిగా ఉండాలన్నమామ పి.పి.రెడ్డి ?
మేఘా సంస్థ చైర్మన్ పి. పిచ్చిరెడ్డికి ఎన్నారై కాలేజీ వ్యవహారం చికాకు తెప్పించింది. అల్లుడు కృష్ణారెడ్డి కబ్జా వ్యవహారం నాలుగేళ్లు అయినా కొలిక్కి రాకపోవడంతో పాటు.. కొంచమైనా నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండాలనే మనిషి కావటంతో.. ఆయన రంగంలోకి దిగారు. నిజమైన డైరెక్టర్స్ కష్టాలు తెలుసుకుని మేనల్లుడికి ఈ వ్యవహారంలో ఎదురు తిరుగినట్లు సమాచారం. దీంతో మేఘా ఫ్యామిలీలో కలహం చెలరేగినట్టు తెలుస్తోంది. కాలేజీ కబ్జా సరికాదని ..ఎవరిదో కష్టార్జితాన్నిఆక్రమించడం వలన ఎప్పటికైనా ఇబ్బందులేనని చర్చించుకున్నారు. అయితే, కబ్జాలతో వ్యాపారం పెరుగుతుందని అల్లుడు చెప్పుకొచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. టీవీ9 కబ్జాతో 30 వేల కోట్ల కాంట్రాక్టులు దక్కాయని లెక్కలు వేసుకున్నారని వినికిడి. కానీ..మొత్తానికి నీతికి విలువనిచ్చే మామకు, అవినీతే జీవితధ్యేయంగా బతికే అల్లుడికీ ఈ యవ్వారంతో గట్టిగానే విభేదాలొచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.