మంది సొమ్ముపై మేఘా టెండర్!
– మన ఊరు మన బడి ఆంధ్రా మేఘాకే..
– ముందే చెప్పిన తొలివెలుగు క్రైంబ్యూరో
– అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు చేసిన కో-టెండర్స్
– ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ లో వేల కోట్ల స్కాం?
– కావాలనుకున్న వారికే టెండర్స్
– తక్కువ కోడ్ చేసినా దక్కనివ్వని వైనం
– చక్రం తిప్పిన మంత్రి కుమారుడు, మేఘా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి
క్రైంబ్యూరో, తొలివెలుగు:మేఘా కృష్ణారెడ్డి కన్ను పడిందంటే చాలు.. దేనికీ వెనుకాడరని కార్పొరేట్ వర్గాల్లో ఓ చర్చ ఉంది. అధికారులను గులాబీనోట్లతో, నాయకులను కమీషన్లతో కొట్టడం.. వ్యవస్థలను మ్యానేజ్ చేయడంలో నెంబర్ వన్ ర్యాంకర్. తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లని పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు రూ.8 వేల కోట్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇలాంటి పథకాల్లో ఎంఎస్ఎంఈలకు 20 శాతం వాటా ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్రప్రభుత్వం 2004లో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ మేఘా కృష్ణారెడ్డి ఎవ్వరినీ కాదని ఒక్కడే.. అర్హత లేకున్నా టెండర్లు దక్కించుకున్నారు. అర్హత సాధించే కంపెనీలతో పొత్తుపెట్టుకుని వేల కోట్ల స్కాంకి తెరలేపుతున్నారు. వారికంటే తక్కువ బిడ్డింగ్ వేసిన కంపెనీలకు టెక్నికల్ అర్హత లేదంటూ పక్కన పడేశారు. దొంగ ఒప్పందాలతో మేఘా కంపెనీ వివిధ బడా సంస్థలతో పొత్తు పెట్టుకున్నట్లు డ్రామాలాడుతున్నారు. ఈ దొంగచాటు వ్యవహారంపై సీబీఐకి ఫిర్యాదులు అందాయి. టెండర్లలో పాల్గొన్న కంపెనీ ప్రతినిధులు ఈ అవకతవకలపై ఫిర్యాదులు చేశారు.
తొలివెలుగు దెబ్బకు టెండర్లు రద్దు.. అయినా మళ్లీ వాళ్లకే..
మన ఊరు మన బడి ద్వారా మేఘాకి దొచిపెడుతున్నారని తొలివెలుగు క్రైంబ్యూరో కథనాలు ఇచ్చింది. తెలంగాణ బడులపై అవినీతి మేఘాలు అంటూ ఏప్రిల్ 27న ఓ ఇన్వెస్టిగేటివ్ కథనాన్ని ఇచ్చింది. మే 4న ఎంఎస్ఎంఈలను కాదని ఎలా దోచిపెడుతున్నారో.. రూ.7వేల కోట్లు కృష్ణార్పణం అని ప్రచురించింది. దీంతో.. 1\3 పాఠశాలలకు పిలిచిన టెండర్లను మే 9న ఓపెన్ చేయాల్సి ఉండగా.. అసలు విషయం పొక్కిందని కోర్టులో ఇబ్బందులు వస్తాయని భయపడుతూనే ఎక్కువ రేట్లు పెంచుతూ.. మరిన్ని టెండర్లను పిలిచింది విద్యాశాఖ. టెండర్లలో బడా కంపెనీలు తప్ప ఎవరూ పాల్గొనకుండా ఉండేలా కఠినమైన నిబంధనలు పెట్టారు. ఇంజనీరింగ్ శాఖలో టెండర్ల లీకేజీలో మేఘా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు నూకరాజు అనే వ్యక్తి కీలక పాత్ర పోషించాడు. ఆ అంశాలపై స్టింగ్ ఆపరేషన్ చేసింది తొలివెలుగు క్రైంబ్యూరో. ఆ తర్వాత 25న ఓపెన్ చేయాల్సిన బిడ్డింగ్ లను ఓపెన్ చేయలేదు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటూ.. దొంగచాటున 30వ తేదీన రహస్యంగా తెరిచారు. మే 24న తాజ్ కృష్ణా హోటల్ లో ఏం జరిగిందో 25న మన ఊరు మన బడిలో రాబడి మేఘాది అంటూ మంత్రి కుమారుడు, మేఘా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెరచాటు డీల్ ని ప్రత్యేక కథనంగా ఇచ్చాం. ఫైవ్ స్టార్ హోటల్ భాగోతం బట్టబయలు చేసే ప్రయత్నం చేశాం. దీంతో 25న టెండర్స్ ఓపెన్ చేయాల్సి ఉన్నా.. చేయకుండా 30న ఓ వెబ్ పేపర్, ఛానల్ ఏం చేస్తాయంటూ దొంగచాటున అన్నీ కానిచ్చేశారు.
సీబీఐ ఫిర్యాదులో ఏముందంటే?
పెయింటింగ్..
పాఠశాలల్లో పెయింటింగ్ వేసేందుకు కార్పొరేట్ సంస్థలకు అప్పగించారు. కొంతమంది విత్ డ్రా అయ్యేలా మంత్రి కుమారుడు ఫైవ్ స్టార్ హోటల్ లో చక్రం తిప్పారు. అది వేరే విషయం అయినా లీగల్ గా రెండే కంపెనీలు వచ్చాయి. ఒక్కటి మేఘా కాగా ఏషియన్ పెయింట్స్ తో కలిపి వేశారు. ఇందులో అనుభవం ఉన్న ఏషియన్ పెయింట్స్ వారికి 20శాతం వాటా ఉంటే.. మేఘాకి 80 శాతం ఉంది. ప్రీ బెడ్డింగ్ మీటింగ్ లో ఎన్నో విషయాలు చర్చించినా.. అవేమి పట్టించుకోకుండా ఎన్నో పెయింట్స్ కంపెనీలు తక్కువకు వచ్చే అవకాశం ఉన్నా.. రానివ్వకుండా మెఘాకే కట్టబెట్టారనేది ప్రధాన ఆరోపణ. అందులో రెండు కంపెనీలు మాత్రమే అర్హత సాధించేలా వారికి మాత్రమే టెండర్స్ దక్కేలా అధికారులు వ్యవహరించారు.
డ్యూయల్ డెస్క్..
వీటి కోసం నాలుగు కంపెనీలు టెండర్స్ లో పాల్గొన్నాయి. తక్కువ ధరకు కోడ్ చేసినా.. వారికి ఇవ్వకుండా ఫేక్ ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ పెట్టుకున్న కంపెనీకి ఎక్కువ ధరకు ఇచ్చేశారు. ఇందులో రెండింటికి మేఘాతో నేరుగా సంబంధాలు ఉన్నాయి.
ఫర్నీచర్ కోసం..
ఇందుకు 5 కంపెనీలు టెండర్స్ లో అర్హత సాధించాయి. కానీ సిల్లి రిజన్స్ తో టెండర్స్ లో పాల్గొన్న వారిని పక్కనపెట్టారు. మేఘాతో టైఅప్ అయిన కంపెనీలకే టెండర్ ఇచ్చేసింది కమిటీ. డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తామనే కంపెనీలకే వెల్ కమ్ పలికింది. ఫేక్ సర్టిఫికెట్స్ గాళ్లకే ప్రాధాన్యత ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బడా కంపెనీల భాగోతం బట్టబయలు చేసినా అధికారులు పట్టించుకోలేదు.
గ్రీన్ చాక్ బోర్డ్స్ వ్యవహారం..
చాక్ బోర్డ్స్ లో కూడా మేఘాతో పొత్తున్న కంపెనీలకే టెండర్లు ఇచ్చారు. అయితే తక్కువ ధరకు టెండర్స్ వేసిన వారు కావాల్సిన వారికి ఇచ్చేందుకు టెక్నికల్ గా మీరు నిజాయితీగా పనిచేస్తారనే హామీ లేదని కూడా రద్దు చేశారు. మేఘాతో సిండికేట్ గా ఏర్పడిన మూడు కంపెనీలు మాత్రమే అర్హతలు లేకున్నా టెండర్స్ దక్కించుకొని దొచుకునే ప్రయత్నం చేస్తున్నాయని వాటన్నింటిపై దర్యాప్తు చేయాలని వీ గణేష్ ఫిర్యాదు చేశారు.
తెలంగాణలో స్కాంలు, వాటి వెనకున్న రహస్యాలు, భూ కుంభకోనాలు.. బినామీలందరి భాగోతాన్ని తొలివెలుగు క్రైంబ్యూరో బయటపెట్టింది. ఇంకా వెలుగులోకి తెస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం తమదేనని ఎవరేం చేయలేరని అనుకుంటున్న వారికి కాలం, ప్రజలే బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. ప్రజల సొమ్ముని అభివృద్ధి పేరుతో బొక్కేస్తున్న వారి భాగోతాలు, వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను పేదల అవసరాల కోసం ఉపయోగించాల్సిన వాటిని అప్పనంగా బినామీలకు ఇచ్చేస్తున్న వైనంపై ఎప్పటికప్పుడు ఆధారాలతో ప్రజల ముందు ఉంచుతాం.