బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై జమ్మూ-కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా మండిపడ్డారు. భద్రతా కారణాలను చూపి తనను పదే పదే గృహ నిర్బంధంలో ఉంచుతున్నారని ఫైర్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా బీజేపీ ప్రచారం చేసుకుంటుందని, కానీ తనను మాత్రం గృహ నిర్బంధంలో ఉంచుతున్నారని మండిపడ్డారు.
మెహబూబా ముఫ్తీని గత 15 రోజుల వ్యవధిలోనే మూడు సార్లు గృహ నిర్బంధంలో ఉంచారు. చట్ట వ్యతిరేకంగా గృహ నిర్బంధంలో ఉంచడం ఇది మూడోసారి. నిజంగా నాకు భద్రత దృష్ట్యా ఏవైనా ఇబ్బందులుంటే మరి బీజేపీ వారు స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా స్వేచ్ఛగా ప్రచారం చేసుకుంటున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల వరకూ నేను అలాగే వేచి చూడాలా? అని ముఫ్తీ ట్వీట్టర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తూ, రాజ్యంగ సంస్థలను వాడుకుంటుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.