‘మెహబూబా’ ప్రమోషన్..న్యూ సాంగ్ రిలీజ్

పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ హీరోగా నటించిన ‘ మెహబూబా ‘ చిత్రం ప్రమోషన్ మెల్లగా ఊపందుకుంటోంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసి చిత్రంపై అంచనాలు పెంచిన యూనిట్.. తాజాగా ‘ ఓ ప్రియా..నా ప్రియా ‘ అనే పాటను రిలీజ్ చేసింది. ప్రగ్యా దాస్ గుప్తా, సందీప్ బాత్రా పాడిన ఈ సాంగ్,,ఆకాష్, అతని సరసన జోడీగా నటించిన హీరోయిన్ నేహా శెట్టి మధ్య సాగిన సినీ లవ్ ని చెప్పకనే చెప్పింది. పంజాబ్, హర్యానా, రాజస్తాన్, హిమాచల్ ప్రదేశ్ బోర్డర్ లో ‘ మెహబూబా ‘ చిత్రం షూటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 1971 లో జరిగిన ఇండో-పాక్ వార్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందించారు. మే 11 న విడుదల కానుంది.