పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) చీఫ్ మెహబూబ ముఫ్తీ సంచలన ఆరోపణలు చేశారు. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన ‘కశ్మీరి ఫైల్స్’ కశ్మీర్ లోయలో హింసను రేకెత్తిస్తుందోని అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లోయలో కశ్మీరి పండిట్లకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించానన్నారు.
‘మేము కశ్మీరి పండిట్లకు సురక్షితమైన వాతావరణాన్ని ఏర్పాటు చేశాము. 2016లో లోయలో అశాంతి పెల్లుబికినప్పుడు కూడా ఎలాంటి మరణాలు చోటు చేసుకోలేదు. కానీ ఇప్పుడు కశ్మీరి ఫైల్స్ సినిమా వల్ల కశ్మీర్ లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి’ అని అన్నారు.
ఆ తర్వాత జ్ఞానవాపి మసీదు వివాదంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఆమె నిప్పులు చెరిగారు. అవన్నీ మన మసీదులన్నారు. వాస్తవ అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వాళ్లు(కేంద్రం) హిందూ ముస్లిం మతఘర్షణలను రెచ్చగొడుతున్నారని ఆమె తెలిపారు.
అవన్నీ మన మసీదులు. మనం ఎక్కడ ప్రార్థనలు చేస్తే దేవుడు అక్కడే ఉంటాడు. మీ దృష్టి ఏఏ మసీదులపై ఉందో మాకు ఒక జాబితా ఇవ్వండన్నారు. అంతకు ముందు కశ్మీర్ ఫైల్స్ సినిమాపై నిషేధం విధించాలని ఫరూక్ అబ్దుల్లా డిమాండ్ చేశారు.