గత రెండు రోజులుగా ప్రభాస్, మారుతి ల రాజా డీలక్స్ సినిమా వార్తలు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రంలో హీరోయిన్ గా మెహరిని పేరు వినిపిస్తుంది. రాధే శ్యామ్ కోసం పూజా హెగ్డే, సాలార్ కోసం శ్రుతి హాసన్, ప్రాజెక్ట్ కె కోసం దీపికా పదుకొణె, మరియు ఆదిపురుష్ కోసం కృతి సనన్‌తో సహా క్రేజ్ ఉన్న హీరోయిన్‌లతో ప్రభాస్ వరుస గా సినిమాలు చేస్తున్నాడు.
కానీ ఇప్పుడు సడెన్ గా మెహరిని పేరు రావటంను అందరికీ షాక్ కు గురిచేస్తుంది. నిజానికి దర్శకుడు మారుతీ తో మెహరిన్ గతంలో చాలా సినిమాలలో నటించింది. ఆ పరిచయం తోనే అవకాశం కోరిందట.
ఇప్పటి వరకు, మెహరిన్ టాలీవుడ్ టాప్ హీరోలలో ఎవరితోనూ జతకట్టలేదు. మరి మారుతి అవకాశం ఇస్తాడో లేదో చూడాలి. ఒకవేళ ఇస్తే సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
ప్రస్తుతం, మెహరిన్ నటించిన ఎఫ్ 3పై రిలీజ్ కు సిద్ధంగా ఉంది. వీటితో పాటు మరికొన్ని చిత్రాలలో కూడా నటిస్తుంది మెహరిన్.