ఏం తిన్నా పొట్ట కిందికి వెళ్ళిపోయి బెల్లీఫ్యాట్ తయారవుతుందని ఎక్కువమంది బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఎక్కువగా కొవ్వు పదార్థాలతో కూడిన ఆహారం తినే వారికి, జంక్ ఫుడ్ తీసుకునే వారికి పొట్ట కింద కొవ్వు వస్తుంది.అయితే ఈ బెల్లీ ఫ్యాట్ తో అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఎక్కడైనా ఫోటో దిగాలి అంటే పొట్ట ఎక్కడ ఫోటోలో పడుతుందో అని వెంటనే లోపలికి లాగేస్తూ ఉంటారు. అంతేకాకుండా చూడ్డానికి అందంగా ఉన్నప్పటికీ మన పొట్ట కారణంగా ఆ అందం అంతా పోతుంది.
పొట్ట కింద ఉండే కొవ్వును కొన్ని ఆయుర్వేదిక చిట్కాలతో తొలగించవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం… రోజూ తినే ఆహారంలో సగం లంచ్ తినాలి. అంతే కాకుండా తక్కువ కేలరీలు ఉన్న డిన్నర్ చేయడం అలవాటు చేసుకోవాలి. అది కూడా రాత్రి 7గంటల లోపే తినాలి. బిస్కెట్స్, బ్రెడ్, పాస్తా ఇలాంటివి తినకూడదు. మెంతులను రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటిని పరిగడుపున తాగాలి.
ప్రతిరోజు రాత్రి భోజనం చేసిన తరువాత త్రిఫల చూర్ణం వేడి నీటిలో వేసుకుని తాగడం అలవాటు చేసుకోవాలి. అల్లం పొడిని, నీటిలో కలిపి లేదా టీ లో అల్లం వేసుకుని తాగకూడదు. పొట్ట పట్టుకొని 30 నిమిషాలపాటు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ప్రతి రోజూ గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. తినేటప్పుడు ఆహారాన్ని బాగా నమిలి తినాలి. వీలైనంత వరకు నడవటం అలవాటు చేసుకోవాలి.