మనం సాధారణంగా ఏదైనా స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకున్నప్పుడు అందులో ఎక్కువ స్టోరేజ్ ఉండాలని కోరుకుంటాను. మంచి స్టోరేజ్ కెపాసిటీ ఉన్న ఫోన్ ఉన్నప్పటికీ, కొన్ని రోజులకు అది ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఫోన్ కొన్నాక ఊరికే ఉండం కదా… యాప్ లు, గేమ్ లు, ఫోటోలు, వీడియోలు అంటూ ఉన్న స్టోరేజ్ మొత్తం వాడేస్తాము. అప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. అయితే ఐఫోన్లో మెమరీ స్టోరేజ్ సమస్య ఎదుర్కొంటున్న వారి కోసం ఈ చిట్కాలు.
యాప్ లు, ఫోటోలు, వీడియోలు, మ్యూజిక్ మొదలైన వాటిలో అవసరం లేని వాటిని డిలీట్ చేసేయండి.
ముఖ్యంగా మెమరీస్ ఎక్కువగా తీసుకునే వీడియోను డిలీట్ చేయండి.
అలా చేయడం వల్ల సిస్టం డేటా ఆప్షన్ మీ ఐఫోన్ లో స్టోరేజ్ పెంచడానికి సహాయపడుతుంది. దానికోసం సెట్టింగ్స్ లోకి వెళ్లి తర్వాత డ్రాప్ డౌన్ మెనూ నుండి జనరల్ లోకి వెళ్లి, ఐఫోన్ స్టోరేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. స్క్రీన్ పై భాగంలో మీ ఫోన్ లో మిగిలి ఉన్న స్థలం ఎంత చూపిస్తుంది.
ఐఫోన్ సిస్టం డేటాను ఎలా డిలీట్ చేయాలంటే…
సఫారీ పేజీ లోకి వెళ్లి కాష్, హిస్టరీ అండ్ డేటాను డిలీట్ చేయండి
టైం లైన్ సెట్ చేశాక మెయిల్స్ ను ఆటోమేటిక్ గా డిలీట్ చేయండి
మెసేజ్ హిస్టరీ డిలీట్ చేయండి
హౌ మెనీ అప్ లను డిలీట్ చేయండి
సోషల్ మీడియా నుండి కాష్ ని క్లియర్ చేయండి.