సినిమా అవకాశాలు రావడం అనేది అనుకున్నంత ఈజీ కాదు అనే మాట వాస్తవం. అగ్ర హీరోగా పైకి వచ్చిన వారు అయినా, చిన్న హీరోలు అయినా సరే ఈ రోజుల్లో నానా కష్టాలు పడాలి. చాలా మంది ఆశీస్సులు ఉండాలి. సినిమా బాగున్నా తర్వాతి అవకాశం వస్తుంది అని చెప్పలేం. ఎవరు ఎన్ని అనుకున్నా సినిమా పరిశ్రమలో అవకాశాల విషయంలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అనే మాట వాస్తవం.
ఏ భాషలో అయినా సరే దీని ప్రభావం ఇప్పుడెలా ఉందో గాని గతంలో మాత్రం గట్టిగానే ఉంది అనే విమర్శలు ఉన్నాయి. దీనిపై కొందరు రోడ్డెక్కిన మాట కూడా వాస్తవం. అయితే ఇది పురుషులకు కూడా వర్తిస్తుంది అంటున్నాడు యువ నటుడు. క్యాస్టింగ్ కౌచ్ భూతం అలాగే ఉందని అంటున్నాడు. సల్మాన్‌ఖాన్ హోస్ట్‌గా ఉన్న బిగ్‌బాస్ 16 సీజన్ అంకిత్‌గుప్తా పాల్గొన్నాడు. సీరియల్స్ లో అతనికి మంచి పేరు వచ్చింది.
తాజాగా క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ… తనకు కూడా కెరీర్ స్టార్టింగ్‌లో కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎందురైందని, ఒక వ్యక్తి తనను కాంప్రమైజ్ అవుతావా ? అని అడగడంతో పాటు ఇప్పుడు స్టార్ హీరోలుగా ఉన్న వాళ్లంతా ఇలా చేసి తర్వాత స్టార్లు అయ్యారని కూడా తనతో చెప్పాడని వెల్లడించాడు. పెద్ద పెద్ద సెలబ్రిటీల పేర్లు చెప్పి తనను లాంచ్ చేస్తానన్నాడని… ఈ స్టార్టు అంతా త్యాగాలు చేస్తేనే ఈ స్థాయికి వచ్చారని కూడా ఆ వ్యక్తి తనపై ఒత్తిడి చేసినట్టు పేర్కొన్నాడు.