జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల కంపెనీ మెర్సిడెస్-బెంజ్ పది లక్షల కార్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఎస్‌యూవీ సిరీస్ లోని పలు మోడల్ కార్ల బ్రెకింగ్ సిస్టమ్ లో సమస్యలు తలెత్తాయని సంస్థ తెలిపింది.
2004 నుంచి 2015 వరకు తయారైన ఎస్‌యూవీ సిరీస్ లోని ఎంఎల్, జీఎల్, ఆర్-క్లాస్ లగ్జరీ మినివ్యాన్ మోడళ్లలో బ్రేక్ పెడల్ తుప్పు పట్టిపోయాయని వివరించింది. దీంతో బ్రేకింగ్ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని గుర్తించామని పేర్కొన్నది.
అందువల్ల ఈ మూడు మోడళ్లకు చెందిన పది లక్షల కార్లను వెనక్కి ఇచ్చేయాలని ఆయా కార్ల యజమానులకు సూచించామని సంస్థ పేర్కొంది. లోపాలను సరిచేసి తిరిగి ఇచ్చేస్తామని వెల్లడించింది.
మొత్తం 9,93,407 కార్లను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో జర్మనీలోనే 70 వేల కార్లు ఉన్నాయని పేర్కొన్నది సంస్థ.