మీరంతా జేమ్స్ కామెరాన్ తీసిన అద్భుత చిత్రం అవతార్ చూశారా..? అందులో గుర్రం సీన్ గుర్తుందా..? దాన్ని మచ్చిక చేసకునేందుకు హీరో జడకు, గుర్రం తలకున్న తోకకు లింక్ పెట్టాడు దర్శకుడు. అంటే హీరో ఆలోచనలకు అనుగుణంగా గుర్రం నడుచుకోవాలని దాని అర్థం. ఇదే ఐడియాతో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ కారును రూపొందించింది. డిస్నీ సంస్ధ సహకారంతో అభివృద్ధి చేసింది.
ఈ స్పెషల్ అవతార్ కారుకు స్టీరింగ్ ఉండదు. కేవలం మనిషి మైండ్ ద్వారా నియంత్రించవచ్చు. బీసీఐ టెక్నాలజీ సాయంతో దీన్ని కంట్రోల్ చేసేలా రూపొందించారు. అంటే.. ఏదైనా బటన్ నొక్కాలంటే మైండ్ లోని ఆలోచన ఆధారంగానే స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. బీసీఐ సిస్టమ్ పనిచేయడం కోసం కంపెనీ తయారుచేసిన ప్రత్యేకమైన హెల్మెట్ ను ధరించాల్సిందే. దాని సాయంతోనే కారును కంట్రోల్ చేసే ఛాన్స్ ఉంది. జర్మనీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఐఏఏ మొబిలీటీ 2021 షోలో దీన్ని ప్రదర్శనకు ఉంచింది సంస్థ.