స్కాట్లాండ్ ను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు అక్కడ అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపైకి వరద నీరు చేరింది. అయితే గ్లాస్గో ప్రాంతంలో ఓ వ్యక్తి వరద నీటిని ఫోటోలు తీస్తుండగా.. ఓ మత్స్యకన్య కనిపించింది. దాన్ని చూసి అతడు షాకయ్యాడు.
ఫోన్ లో ఇంకాస్త జూమ్ చేసి చూడగా.. ఓ యువతి మత్స్యకన్యలా ఫ్యాన్సీ డ్రెస్ వేసుకుని ఈత కొడుతున్నట్లు గ్రహించాడు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే లైకుల వర్షం కురుస్తోంది.
పోస్ట్ చేసిన కొన్ని నిమిషాలకే బాగా వైరల్ అయింది ఈ ఫోటో. ఇదే కాదు.. వరదలకు సంబంధించిన ఇంకా చాలా ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ప్రజలు.