గడిచిన సంవత్సరానికి వీడ్కోలు పలికి, రాబోయే సంవత్సరానికి స్వాగతం పలకడానికి మనం రెడీ గా ఉన్నాం. ఎన్నో అనుభవాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో కొత్త విషయాలతో పాత ఏడాదికి గుడ్ బై చెప్పేస్తున్నాం. కొత్త ఏడాదిలోకి సంతోషంగా అడుగు పెట్టాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి మనం ఎప్పుడూ రెడీ గానే ఉన్నా సరే ఈసారి కూడా కరోనా మహమ్మారి నానా ఇబ్బందులు పెట్టడానికి సిద్దంగా ఉంది.
ఇక కోవిడ్ కారణంగా, సమావేశాలకు దూరంగా ఉండాలి. దీనితో సోషల్ మీడియాలో మన వారికి విష్ చెప్తూ ఇంట్లోనే పార్టీ చేసుకుంటున్నాం. అయితే న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పడానికి… మనం వాట్సాప్ ను ఎక్కువగా వాడుతూ ఉంటాం. అయితే అందరికి ఒకేసారి మెసేజ్ చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి… అందరికి ఒక్కసారి విష్ చేయాలని భావిస్తే అందుకు గ్రూప్ చేసుకుంటారు చాలా మంది. అలా కాకుండా మరో విధంగా కూడా మనం విష్ చేసే అవకాశం ఉంది.
దాదాపుగా వెయ్యి మందికి గ్రూప్ లేకుండా మీరు ఒకేసారి మెసేజ్ చేసే అవకాశం ఉంది. బ్రాడ్ కాస్ట్ ను వాట్సాప్ లో క్రియేట్ చేసుకుని అందరికి ఒకేసారి మెసేజ్ చేయవచ్చు. దీని గురించి చాలా మందికి అవగాహన లేదు. గ్రూప్ ద్వారా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది గాని బ్రాడ్ కాస్ట్ ద్వారా ఏ సమస్య ఉండదు. వాట్సాప్ ఓపెన్ చేసి మోర్ ఆప్షన్స్ క్లిక్ చేస్తే బ్రాడ్ కాస్ట్ కనపడుతుంది. అక్కడ క్లిక్ చేస్తే క్రియేట్ న్యూ బ్రాడ్ కాస్ట్ ఉంటుంది. అక్కడ బ్రాడ్ కాస్ట్ లో కాంటాక్ట్ లను యాడ్ చేసి అందరికి ఒకేసారి మెసేజ్ చేయవచ్చు.