ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్‌కు పెట్టింది పేరు. యూజర్ ఫ్రెండ్లిగా ఉండడం, వినియోగదారుల అభిరుచులకు, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకువస్తుండడం వల్లే ఈ యాప్‌కు ఇంత ఆదరణ లభించింది అని చెప్పొచ్చు.
ఇక ప్రైవసీ పెద్ద పీట వేసే వాట్సాప్ యూజర్ల భద్రత కోసం నిత్యం ఏదో ఒక అప్‌డేట్ తీసుకొస్తూనే ఉంది.
అలా తీసుకువచ్చిన ప్రైవేట్ పాలసీపై విచారణ జరపాలంటూ కొన్ని రోజుల క్రితం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది.
అయితే తమపై విచారణ జరిపేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వద్ద ఆధారాలు, పత్రాలు లేవని ఢిల్లీ హైకోర్టుకు ఫేస్‌బుక్ తెలిపింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీ విషయం అప్‌డేట్ పై వాట్సాప్, ఫేస్‌బుక్‌కు సీసీఐకి మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తుంది.
న్యాయమూర్తులు జస్టిస్ సతీశ్ చంద్ర, జస్టిస్ సుబ్రమణియం ధర్మాసనం ముందు ఫేస్‌బుక్ తరఫు న్యాయవాది రోహత్గి వాదనలు వినిపించారు. తమ సంస్థపై విచారణ జరిపే అధికారం సీసీఐకి లేదని వాట్సాప్ తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే పేర్కొన్నారు. తదుపరి విచారణ 25కు వాయిదా పడింది.