ఐఎండీ. నైరుతి రుతుపవనాల ప్రభావంతో, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అఅకాల వర్షాలు ఇప్పటికే రైతులను ఆగమాగం చేశాయి. దానిలో నుండి ఇంకా తేరుకోక ముందే.. అన్నదాతలకు మరో పిడుగు లాంటి వార్త చెప్పింది వకాశముందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ.
ఈనెల 21 వరకు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్తున్నారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు.
తెలంగాణలో వరి కోతలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ టైంలో వర్షాలు కురిస్తే.. నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. దేశంలోకి ఇప్పటికే నైరుతి రుతుపవనాలు రావడంతో ఆ ప్రభావం రాష్ట్రంపై ఉంటుందని అంచనా వేస్తున్నారు ఐఎండీ అధికారులు. నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో మరింత చురుకుగా కదులుతున్నాయని చెప్తున్నారు.
అండమాన్ దీవులకు పూర్తిగా రుతువపనాలు విస్తరించాయంటున్నారు. నాలుగైదు రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, దక్షిణ కర్నాటక తీరాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.