వినరో భాగ్యము విష్ణుకథ సినిమాలో కొంత మాస్ చూపించాడు కిరణ్ అబ్బవరం. తనకు మాస్ సినిమా ట్రై చేయాలని ఉందనే కోరికను ఆ సినిమాతోనే ప్రేక్షకుల మెదళ్లలో చొప్పించాడు. ఆ సినిమా వచ్చిన నెల రోజుల గ్యాప్ లోనే మీటర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈసారి పూర్తిస్థాయి మాస్-కమర్షియల్ సినిమా చేసేశాడు.
కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే ఫుల్ లెంగ్త్ మాస్-యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. మంగళవారం రిలీజైన టీజర్ చూస్తుంటే ఈ విషయం ఈజీగా అర్థమైపోతుంది.
మీటర్ సినిమాలో పోలీసాఫీసర్ పాత్ర పోషించాడు కిరణ్ అబ్బవరం. పక్కా మాస్ యాటిట్యూడ్ చూపించాడు. డైలాగ్ డెలివరీలో మాత్రం తన సీమ యాసనే కొనసాగించాడు. పోలీస్ డిపార్ట్ మెంట్ లో కిరణ్ ఎదుర్కొన్న సమస్యలేంటి? విలన్ తో ఎందుకు తలపడాల్సి వచ్చిందనే అంశాలతో మీటర్ టీజర్ కట్ చేశారు.
టీజర్ లో మాస్ ఎలిమెంట్స్ దండిగా ఉన్నాయి. డైలాగ్స్ కూడా మాస్ మీటర్ లోనే నడిచాయి. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. మరో నెల రోజుల్లో థియేటర్లలోకి వస్తోంది మీటర్ మూవీ