గ్రేటర్ హైదరాబాద్ లో ప్రభుత్వం నుండి వచ్చే నల్లాలకు మీటర్లు పెట్టనున్నారా…? మీటర్లుంటేనే నీరు ఇచ్చే పరిస్థితి రానుందా…? అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.
తాజాగా సీఎం కేసీఆర్ చేసిన హైదరాబాదీల్లో 98శాతం మందికి ఉచితంగా నల్లా నీరిస్తామన్న ప్రకటన చేశారు. అయితే, ప్రకటన చేస్తూనే 20వేల లీటర్ల వరకు మాత్రమే ఈ ఉచిత నీరు ఉంటుందని కేసీఆర్ ప్రకటన చేశారు. దీన్నే టీఆర్ఎస్ ఎన్నికల హామీల్లో కూడా చేర్చారు.
అయితే, 20వేల లీటర్లు అంటే ఖచ్చితంగా మీటర్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత లీటర్ కు చొప్పున ప్రభుత్వం చార్జ్ చేయనుంది. దాన్ని బట్టి ఎక్కువ చార్జీలు వచ్చే అవకాశం ఉంటుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ లో చాలా వరకు మీటర్లు లేవని… ఎంత నీరు వాడిన 300లోపు మాత్రమే బిల్లు వచ్చేదని, ఇక మీద 20వేల లీటర్లు దాటితే బాదుడే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.