బ్బంది ధర్నాను విరమించారు. కియోలిస్ ప్రతినిధులతో చర్చలు ఫలించాయి. దీంతో ధర్నాను విరమిస్తున్నట్లు ప్రకటించారు. మరోసారి కూడా చర్చలు జరగనున్నాయి. మంగళవారం ఉదయం నగరంలోని మెట్రో టికెట్ కౌంటర్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసనకు దిగారు. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ కారిడార్ లోని 27 స్టేషన్లలోనూ ఆందోళన చేపట్టారు.
గత కొంతకాలంగా సరైన జీతభత్యాలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్నప్పుడు రిలీవర్ సరైన సమయానికి రాకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కనీసం భోజనం చేయడానికి కూడా సమయం ఇవ్వడం లేదన్నారు. వేతనాలు పెంచే వరకు విధులకు హాజరు కాబోమని తేల్చిచెప్పారు.
కాంట్రాక్ట్ ఏజెన్సీ స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేయగా.. చర్చలు సాగాయి. అవి ఫలించి ప్రస్తుతానికి ధర్నా విరమిస్తున్నట్లు మెట్రో టికెటింగ్ సిబ్బంది ప్రకటించారు.
అయితే.. ఈ ధర్నాపై మెట్రో సంస్థ యాజమాన్యం సీరియస్ అయినట్లు ప్రచారం సాగుతోంది. కాంట్రాక్టు ఉద్యోగులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని.. మెట్రో సేవలకు అంతరాయం కలిగించినందుకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. స్వార్థ ప్రయోజనాల కోసం ధర్నాకు దిగారని మెట్రో సంస్థ సీరియస్ గా ఉందని అంటున్నారు.