రాహుల్ గాంధీని రాజకీయంగా ఎదుర్కోలేక కేంద్ర ప్రభుత్వం ఈడీ విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు ఫిషర్మెన్ కాంగ్రెస్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్. రాహుల్ గాంధీ ఈడీ విచారణను నిరసిస్తూ.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాల దిష్టి బొమ్మలను దగ్దం చేశారు.
దేశంలో నిజాయితీకి నిలువుటద్దం లాంటి గాంధీ కుటుంబంపై నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు సాయికుమార్. గాంధీ కుటుంబంపై బూటకపు కేసులు పెట్టి.. మోడీ ప్రభుత్వం బురదజల్లేందుకు ప్రయత్నిస్తోందని విరుచుకుపడ్డారు.
అగ్నిపథ్ పథకంతో విద్యార్ధుల జీవితాల్లో నిప్పులుపోస్తోందని కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు సాయి కుమార్. దేశ భద్రతను తాకట్టు పెడుతోందని విమర్శలు గుప్పించారు. ఆర్మీలో చేరి దేశానికి రక్షణ కల్పించేందుకు సిద్ధమైన అభ్యర్ధులపై కేసులు పెట్టి జీవితాలను జైలు పాలు చేస్తోందని ఆరోపించారు.
ఆర్మీలో కాంటాక్ట్ పద్దతిలో రిక్రూట్ మెంట్ చేయడం సమంజసం కాదన్నారు సాయి కుమార్. భారత దేశాన్ని పరాయి దేశాలకు చెందిన కాంట్రాక్టుల చేతిలో పెట్టు కుట్రచేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే అగ్నిపథ్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు సాయికుమార్.