రెస్టారెంట్ కి వెళ్తే చాలామంది టాకోస్, బరిట్టోస్, క్యుసడిలాస్ వంటి మెక్సికన్ ఫుడ్ ను చాలా మంది తినడానికి ఇష్టపడుతుంటారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా ఓ రెస్టారెంట్ కు వెళ్లారు. ఆయన చికెన్ క్యుసడిలాస్‌ను ఇష్టంగా తింటారు.
ఓ రెస్టారెంట్ నుంచి చికెన్ క్యుసడిలాస్‌ను కొనుగోలు చేస్తున్న వీడియోను జో బైడన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బైడెన్ లాస్‌ఏంజెల్స్‌లోని టాకోస్ 1989 అనే మెక్సికన్ రెస్టారెంట్‌కు వెళ్లారు. బైడెన్ నేరుగా ఆర్డర్ తీసుకుంటుడటం ఈ వీడియోలో కనిపించింది.
ఆర్డర్‌కు చెల్లించాల్సిన మొత్తం గురించి బైడెన్ అడగ్గా 50 శాతం డిస్కౌంట్ లభించిందని క్యాషియర్ బైడెన్‌కు చెప్పాడు.16.45 డాలర్ల బిల్లు రాగా, బైడెన్ ఏకంగా 60 డాలర్లు చెల్లించారు. తర్వాతి ఆర్డర్ ఫ్రీగా ఇవ్వాలని బైడెన్ క్యాషియర్‌ను కోరారు.
మీరు తర్వాత క్యుసడిలా కొంటే నాకు చెప్పాలని జో బైడెన్ ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియోను పది లక్షల మందికి పైగా వీక్షించగా పెద్ద సంఖ్యలో నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. తాను చూసిన గొప్ప అధ్యక్షుల్లో మీరు ఒకరని పలువురు యూజర్లు కామెంట్స్ సెక్షన్‌లో రాసుకొచ్చారు.
If you got the next quesadilla, let me know. pic.twitter.com/gLJGs98jME
— President Biden (@POTUS) October 14, 2022