పూణెలో ఉన్న గూగుల్ కార్యాలయంలో ఈ రోజు ఉదయం గందరగోళం నెలకొంంది. గూగుల్ ఆఫీసులో ఎవరి బాంబు అమర్చారంటూ ఓ అపరిచిత వ్యక్తి చేసిన ఫోన్ కాల్ అధికారులను కలవరానికి గురించేసింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కొద్దిసేపటికే వారు రంగంలోకి దిగారు. కార్యాలయం మొత్తం చెక్ చేశారు.
ఎటువంటి బాంబు లేదని నిర్ధారించారు. ఎవరో కావాలని ఆటపట్టిస్తున్నారని తేల్చారు. బెదిరింపు కాల్ వచ్చిన అడ్రస్ ట్రేస్ చేశారు.హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి కాల్ చేశాడని తెలుసుకున్నారు. పక్కా సమాచారంతో ఆ చిరునామాకు చేరుకుని అతడిని అరెస్టు చేశారు. తాగిన మైకంలో ఆ వ్యక్తి ఈ పనికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.
దీంతో పూణెలోని గూగుల్ కార్యాలయ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. యధావిధిగా తమ పనులు తాము చేసుకుంటున్నారు.పూణెలోని ముధ్వా ప్రాంతంలో ఉన్న ఓ వాణిజ్య భవనంలోని 11వ ఫ్లోర్ లో గూగుల్ కార్యాలయం ఉంది.
ఆదివారం రాత్రి ఎవరో అపరిచిత వ్యక్తి కాల్ చేశాడని, ఆఫీసులో బాంబు ఉందని బెదిరించాడని పోలీసు అధికారులు వెల్లడించారు. తమకు సమాచారం అందగానే రంగంలో దిగి ఆఫీసులో తనిఖీలు చేపట్టామని, ఎటువంటి బాంబు లేదని నిర్ధారించామని పోలీసులు తెలిపారు.