సీడీఎస్ బిపిన్ రావత్ కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్న Mi-17 హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో భారీ నష్టం జరిగింది. దీంతో ఈ హెలికాఫ్టర్ ప్రత్యేకతలు, సామర్థ్యంపై ప్రస్తుతం చర్చ నడుస్తుంది.
Mi-17 హెలికాఫ్టర్స్ Mi-8/17 కుటుంబానికి చెందిన మిలిటరీ రవాణా విమానాలు. ఇందులో ఒకే సారి 36 మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. భద్రతా బలగాలు వీటిని రవాణాకు, అగ్ని ప్రమాదాల కట్టడి చేయడానికి ఉపయోగిస్తారు. అటు, కాన్వాయ్ ఎస్కార్ట్ గా, పెట్రోలింగ్, గాలింపు చర్యల సమయంలో వీటిని ఉపయోగిస్తారు.
వీటిని రష్యా నుంచి భారత రక్షణ శాఖ దిగుమతి చేసుకుంది. 2008 డిసెంబర్‌లో మొత్తం 80హెలికాఫ్టర్స్ కొనుగోలు చేయడానికి రక్షణ శాఖ 1.3 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. 2011 నుంచి డెలివరీ మొదలు పెట్టిన రష్యా 2013 నాటికి మొత్తం 80 హెలికాఫ్టర్లను భారత్ కు అందించింది.