ఐపీఎల్ 2022లో రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు నిరాశే ఎదురైంది. డివై పాటిల్ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో.. 23 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. ఇది టోర్నీలో ఇది రాజస్తాన్‌కు వరుసగా రెండో విజయం కాగా.. ముంబై వరుసగా రెండో ఓటమిని చవిచూసింది.
194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 8 వికెట్లు కోల్పోయి 170 పరుగులకే పరిమితమైంది. ముంబై ఆటగాళ్లలో తిలక్ వర్మ(61), ఇషాన్ కిషన్(54) పరగులతో టాప్ స్కోరర్‌లుగా నిలిచారు. కెప్టెన్ రోహిత్ శర్మ(10) భారీ సిక్సర్‌తో జోష్‌గా కనిపించిన ఆదిలోనే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అన్‌మోల్ ప్రీత్ సింగ్(5) మరోసారి నిరాశపరిచారు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎవరూ క్రీజులో నిలబడలేకపోయారు. చివర్లో కీరన్ పొలార్డ్ (22) మెరుపులు మెరిపించినా.. ముంబైకి ఓటమి తప్పలేదు.
టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 193 పరుగుల భారీ స్కోర్ చేశారు. ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ ప్రారంభించిన.. జోస్ బట్లర్(100) సెంచరీతో చెలరేగాడు. షిమ్రాన్ హెట్‌మైర్(35), సంజూ శాంసన్(30)తుఫాను ఇన్నింగ్స్ ఆడారు. ఇక యశస్వి జైస్వాల్ (1), దేవ్‌దత్ పడిక్కల్ (7), అశ్విన్ (1), రియాన్ పరాగ్(5), నవదీప్ సైనీల (2) పరుగులు చేశారు.
Advertisements
ఇక ముంబై బౌలరల్లో బుమ్రా, టైమల్ మిల్స్ మూడేసి వికెట్లు తీశారు. పొలార్డ్‌కు ఒక వికెట్ దక్కింది. ఇక రాజస్థాన్ బౌలర్లలో నవదీప్ సైనీ 2, చహల్ 2, ట్రెంట్ బౌల్ట్ 1, ప్రసిద్ధ్ కృష్ణ 1, రవిచంద్రన్ అశ్విన్ ఒక్క వికెట్ తీశారు.