కేజీఎఫ్ అనేది ఓ వండర్. స్క్రీన్ ప్లే కు పరాకాష్ట. సినిమాను ఇలా కూడా తీయొచ్చు అని ఇండియాకు చాటిచెప్పిన చిత్రం. రెగ్యులర్ స్క్రీన్ ప్లేకు భిన్నంగా ఉంటుంది కేజీఎఫ్ ఫ్రాంచైజీ. ఇంకా చెప్పాలంటే, ఆ సినిమాలో ప్రతి సీన్ లో అడుగడుగునా ఎలివేషన్లు కనిపిస్తాయి. ప్రతి సీన్ క్లయిమాక్స్ లా అనిపిస్తుంది.
ఇదొక ఎత్తయితే.. కేజీఎఫ్ బ్యాక్ గ్రౌండ్, కలర్ స్క్రీమ్, నెరేషన్ స్టయిల్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది. ఆ కొత్తదనంతో పాటు, కంటెంట్ కూడా బాగుండడంతో కేజీఎఫ్ అఖండ విజయం సాధించింది.
ఇదే ఫార్మాట్ లో సినిమా తీసి హిట్ కొట్టాలనుకున్నాడు సందీప్ కిషన్. కేజీఎఫ్ టెక్నిక్ ను మక్కికి మక్కి దింపేశాడు. తాజాగా రిలీజైన మైఖేల్ చూస్తే కేజీఎఫ్ గుర్తొస్తుంది.
కేజీఎఫ్ లో ఫాలో అయిన కలర్ ప్యాలెట్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎలివేషన్లు, స్క్రీన్ ప్లే, వాయిస్ ఓవర్.. ఇలా సమస్తం మైఖేల్ సినిమా కోసం ఫాలో అయ్యాడు సందీప్ కిషన్. కానీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు. దీనికి కారణం కథ.
మైఖేల్ లో సరైన కథ లేదు. ఈ సినిమా చూస్తున్నంతసేపు మున్నా, సాహో సినిమాలు గుర్తొస్తాయి. అలా అని దాన్నయినా సరిగ్గా ప్రజెంట్ చేస్తే బాగుండేది. సినిమా నీరసంగా సాగుతుంది. హీరో క్యారెక్టరైజేషన్ వీక్.
అలా కేజీఎఫ్ ను చూసి స్ఫూర్తిపొంది తీసిన మైఖేల్ సినిమా, ఆ మేజిక్ ను రిపీట్ చేయలేకపోయింది. చెప్పుకోడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ, సందీప్ కిషన్ కు భారీ ఫ్లాప్ పడింది.